ప్రపంచ టాప్ 20 మహిళా ధనవంతులు వీరే!

05-06-2023 Mon 17:30 | International
Advertisement
  • మహిళా ధనవంతుల జాబితాను విడుదల చేసిన ఫోర్బ్స్
  • జాబితాలో సావిత్రి జిందాల్
  • 93 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ప్రాంకోయిస్
Advertisement
ఫోర్బ్స్ ప్రపంచ మహిళా కుబేరుల జాబితాను విడుదల చేసింది. రియల్ ఎస్టేట్ రంగం నుండి రిటైల్, క్యాసినో, కాస్మోటిక్స్, బ్యాంకింగ్.. ఇలా వివిధ రంగాల మహిళలు ఉన్నారు. టాప్ టెన్ లో 8 మంది అమెరికా నుండి ఉండటం గమనార్హం. ఈ జాబితాలో సావిత్రీ జిందాల్ కూడా ఉన్నారు.

వరల్డ్ టాప్ 20 మహిళా ధనికుల జాబితాలో ఫ్రాంకోయిస్ బెట్టెన్ కోర్ట్ మొదటి స్థానంలో ఉన్నారు. 93 బిలియన్ డాలర్లతో మహిళా ధనికుల్లో మొదటి స్థానంలో, ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితాలో 9వ స్థానంలో నిలిచారు. 1997 నుండి ఆమె ఎల్ఓరియల్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మెంబర్ గా ఉంటున్నారు. బెట్టెన్ కోర్ట్ , ఆమె కుటుంబం ఈ కంపెనీలో 33 శాతం స్టాక్స్ కలిగి ఉన్నారు.

వాల్ మార్ట్ ఫౌండర్ శామ్ వాల్టన్ కూతురు ఎలిస్ వాల్టన్ 61.4 బిలియన్ డాలర్లతో మహిళా కుబేరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఆమె తన కెరీర్ ప్రారంభంలో పెట్టుబడులపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత క్రమంగా సొంతంగా లియామా కంపెనీని ప్రారంభించారు. 1990లలో అది మూతపడింది. 

జులియా కోచ్, కుటుంబం 59 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచారు. కోచ్ ఇండస్ట్రీస్ లో వీరికి 42 శాతం వాటా ఉంది. ఆమె లోవాలో జన్మించారు. ఫ్యాషన్ ఇండస్ట్రీ కోసం 1980లలో న్యూయార్క్ కు వెళ్లారు. ప్రస్తుతం ఈమె డేవిడ్ హెచ్ ను లీడ్ చేస్తున్నారు. 

38.3 బిలియన్ డాలర్లతో జాక్వెలీన్ మార్స్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఈమె మార్స్ క్యాండీ కంపెనీ వ్యవస్థాపకులు ప్రాంక్ మార్స్ మనవరాలు. క్యాసినో కంపెనీ లాస్ వెగాస్ సాండ్స్ లో మెజార్టీ వాటా కలిగిన మిరియమ్ అడెల్సన్ 37.7 బిలియన్ డాలర్లతో 5వ స్థానంలో ఉన్నారు. 
షిప్పింగ్ సంస్థ ఎంఎస్సీ సహ యజమాని రఫేలా అపోంటే 31.3 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నారు. 

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకంజీ స్కాట్ 27.6 బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నారు. 2019లో విడాకుల సెటిల్మెంట్ లో భాగంగా బెజోస్ భారీ మొత్తం ఇచ్చారు. 
ఆస్ట్రేలియన్ గినా రినెహార్ట్ తన తండ్రి తర్వాత హాన్ కాక్ ప్రాస్పెక్టింగ్ కంపెనీని రన్ చేస్తున్నారు. ఈమె సంపద 27.3 బిలియన్ డాలర్లుగా ఉంది. 

ఎకనమిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన సుసాన్నే క్లేటన్ 24.7 బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నారు. ఐరిస్ ఫోంట్‌బనా ఆమె కుటుంబం 22.8 బిలియన్ డాలర్లు, అబిగెయిల్ జాన్సన్ 21.6 బిలియన్ డాలర్లు, సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ 17.6 బిలియన్ డాలర్లు, విక్కీ సఫ్రా అండ్ ఫ్యామిలీ 17 బిలియన్ డాలర్లు, రెనాటా కెల్నెరోవా అండ్ ఫ్యామిలీ 17 బిలియన్ డాలర్లు, బీట్ హెస్టర్ 15.9 బిలియన్ డాలర్లు, చార్లెన్ డీ కార్వాలో - హీనెకెన్ అండ్ ఫ్యామిలీ, 15.9 బిలియన్ డాలర్లు, వోంగ్ సూ-హింగ్ 14.5 బిలియన్ డాలర్లు, డయాన్ హెన్‌డ్రక్స్ 13.7 బిలియన్ డాలర్లు, లారెన్ పోవెల్ జాబ్స్ అండ్ ఫ్యామిలీ 12.8 బిలియన్ డాలర్లు, క్రిస్టీ వోల్టన్ 11 బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నారు.
Advertisement
richest women

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more